అఖిల్ 'లెనిన్' విడుదల వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన నాగార్జున
- మరింత స్పెషల్‌గా 'లెనిన్'
- జూలై 10న వస్తున్నాడంటూ నాగార్జున అప్ డేట్
- సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన నాగార్జున
- మరింత నాణ్యమైన అవుట్‌పుట్ కోసమే ఈ నిర్ణయమని వెల్లడి
- ఈ చిత్రంతో కొత్త అఖిల్‌ను చూస్తారని నాగార్జున భరోసా
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'లెనిన్' విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నటుడు కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. సినిమాను జూలై 10న విడుదల చేయనున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
ఈ వాయిదాకు గల కారణాన్ని నాగార్జున స్పష్టంగా వివరించారు. "లెనిన్ చిత్రబృందం నన్ను కలిసి, సినిమాను మరింత ప్రత్యేకంగా, 100 శాతం అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. వారిలోని అభిరుచి, స్ఫూర్తి చూసి నేను అంగీకరించాను" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అంతేకాకుండా, సినిమాపై అంచనాలు పెంచేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మనోడు జూలై 10న వస్తున్నాడు. నేను మళ్ళీ చెబుతున్నా, మీరు ఒక కొత్త అఖిల్‌ను చూస్తారు! 'లెనిన్' అనుభవానికి సిద్ధంగా ఉండండి" అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. నాగార్జున ప్రకటనతో సినిమా విడుదల తేదీపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. నాణ్యమైన చిత్రాన్ని అందించాలనే లక్ష్యంతోనే చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.